NBK111 : మరోసారి ఆ అవతారమెత్తనున్న బాలయ్య..?

NBK111 : మరోసారి ఆ అవతారమెత్తనున్న బాలయ్య..?

Published on Dec 15, 2025 10:56 PM IST

Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారబోతున్నాడని చిత్ర వర్గాల టాక్. గతంలో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘పైసా వసూల్’(Paisa Vasool) చిత్రంలో ఓ పాట పాడి అందరికీ షాకిచ్చారు. ఇప్పుడు NBK111 కోసం మరోసారి బాలయ్య తన గళం వినిపించనున్నారు.

దీంతో గోపీచంద్ మలినేని బాలయ్యతో ఎలాంటి పాటను పాడిస్తాడా.. అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించనున్నాడు. అందాల భామ నయనతార(Nayanthara) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు