99వ మూవీ కోసం వెయిట్ తగ్గనున్న బాలయ్య

99వ మూవీ కోసం వెయిట్ తగ్గనున్న బాలయ్య

Published on May 21, 2015 4:04 PM IST

balakrishna
అభిమానులను మెప్పించడం కోసం సినిమా సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపించడానికి ట్రై చేసే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. కథ ఓకే చేసాక ఆ కథ కోసం ఏమి చెయ్యడానికైనా సిద్దం అంటాడు బాలకృష్ణ. లయన్ సినిమాతో అభిమానులను మెప్పించిన బాలకృష్ణ ఇప్పుడు 99వ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. శ్రీ వాస్ బాలకృష్ణ కోసం ఓ స్పెషల్ గెటప్ ని డిజైన్ చేసాడు. అందుకోసం బాలకృష్ణ చాలా వెయిట్ తగ్గే పనిలో ఉన్నాడు. ఎక్కువ భాగం బాలయ్య స్లిమ్ లుక్ లో కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే బాలయ్య వెయిట్ తగ్గడం కోసం స్పెషల్ డైట్ తీసుకుంటున్నాడు.

99వ సినిమా కావడం వలన బాలకృష్ణ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అందుకోసమే బాలకృష్ణ 99వ సినిమాని తన కెరీర్లోనే చాలా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని ఇరోస్ వాళ్ళు నిర్మాతలైనప్పటికీ నిర్మాణ బాధ్యతలను కూడా డైరెక్టర్ శ్రీ వాస్ తీసుకున్నాడు. దాంతో శ్రీవాస్ చాలా దగ్గరుండి అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే బాలయ్య 99వ సినిమాకి ‘డిక్టేటర్’ అనే టైటిల్ ని ఖరారు చేసిన శ్రీ వాస్ ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ని ఎంపిక చేస్తున్నాడు. ఇప్పటికే టాప్ రైటర్స్ అయిన కోన వెంకట్ – గోపి మోహన్ – రత్నం – శ్రీధర్ సీపాన కలిసి కథని పర్ఫెక్ట్ గా సిద్దం చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ఎస్ తమన్ ని ఎంపిక చేసారు. ఈ నెల 29న అధికారికంగా ప్రారంభం కానున్న ఈ సినిమా జూన్ మొదటి వారం నుంచి సెట్స్ పికి వెళ్తుంది.

తాజా వార్తలు