`కేజీఎఫ్ 2’లో బాలయ్య బాబు.. నిజమేనా ?

`కేజీఎఫ్ 2’లో బాలయ్య బాబు.. నిజమేనా ?

Published on Dec 28, 2020 9:33 AM IST

kgf2 2

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి కేజీఎఫ్ సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు నటించబోతున్నాడు అంటూ గూగుల్ చూపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గూగుల్‌ సెర్చ్‌లో ‘కేజీఎఫ్‌2’ అని వెతికితే ఆ సినిమాలో నటీనటుల జాబితాలో బాలయ్య బాబు పేరు కూడా ఉంది. పైగా బాలయ్య పోషించబోయే పాత్ర పేరు ‘ఇనాయత్‌ ఖలీల్‌’ అని కూడా ఉంది. కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు.

ఇక ఈ చిత్రంలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా పై హైప్ మరింత పెరిగింది. ఇక సంజయ్ దత్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని.. ‘యశ్’ కంటే కూడా సంజయ్ దత్ నే హైలెట్ అవుతాడని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ఇక `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించి పాన్ ఇండియా సినిమా అయింది. కాగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు