బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Published on Jun 3, 2023 5:12 pm IST

ఒడిశాలోని బాలాసోర్‌లో నిన్న మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో దురదృష్టకర భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షాలిమార్ సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు మరియు బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఈ విషాద ఘటనలో 260 మంది వ్యక్తులు మరణించారు మరియు 900 మందికి పైగా గాయపడ్డారు.

దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత దారుణమైన ప్రమాద ఘటన ఇది. కాగా రైల్వే మంత్రిత్వ శాఖ మరణించిన వారికి రూ. 10 లక్షలు, అలానే గాయాలపాలై క్షతగాత్రులైన వారికి వారికి రూ. 2 లక్షలు మరియు స్వల్ప గాయాలైన వారికి రూ. 50000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆ ఘటనలో బాధితులు త్వరగా కోలుకోవాలని, అలానే మరణించిన వారి కుటుంబాలకు ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని అందించాలని కోరుతూ పలువురు ప్రజలు, రాజకీయ ప్రముఖులతో పాటు అనేకమంది టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :