ఆధ్యాత్మికవేత్తగా బాలయ్య ?

Published on Jan 23, 2020 3:00 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక స్టోరీ లైన్ హల్ చల్ చేస్తోంది. సినిమాలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో పూర్తి ఆధ్యాత్మిక వేత్తగా కనిపించబోతున్నాడని.. ఆలాగే ఆధ్యాత్మికతతో మొదలై బాలయ్య పాత్ర కూడా చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే బాలయ్య అసలు ఆధ్యాత్మిక వేత్తగా ఎలా మారాడు ఆయన గతం ఏమిటి అనే కోణంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా వస్తోందట.

ఇక నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. బోయపాటి ఇంట్లో జరిగిన విషాదం కారణంగా అనుకున్న డేట్ కి షూటింగ్ ప్రారంభించట్లేదు. ఇక హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడట. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు.

సంబంధిత సమాచారం :

X
More