తన రికార్డ్ ని తానే అధికమించి బాలయ్య
Published on Jul 29, 2017 2:04 pm IST


బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నిన్న పైసా వసూల్ చిత్ర స్టంపర్ ని విడుదల చేశారు. 23 గంటలు తిరిగేసరికి యూట్యూబ్ లో 2.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. బాలకృష్ణ గత చిత్రమైన గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రికార్డ్ ని పైసా వసూల్ స్టంపర్ అధికమించింది.

కాగా పైసా వసూల్ స్టంపర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో ప్రధమ స్థానంలో ఉంది. కాగా ఇంతటి కూల్ లుక్ లో బాలయ్యని గత చిత్రాలలో చూడలేదని చెప్పాలి. పూరి మార్క్ డైలాగులను బాలయ్య తనదైన శైలిలో చెప్పి ఆకట్టు కున్నాడు. ఈ స్టంపర్ తో చిత్రం పై అంచనాలు పెరుగుతాయండంలో ఎలాంటి సందేహం లేదు. బాలయ్య సరసన శ్రీయ హీరోయిన్ గా నటిస్తోంది.

స్టంపర్ 101 కోసం క్లిక్ చేయండి:

 
Like us on Facebook