బాలయ్య కామెంట్స్ పై సోషల్ మీడియాలో రచ్చ.!

Published on Jul 22, 2021 1:40 pm IST

నందమూరి బాలకృష్ణ ఎంత ముక్కు సూటి మనిషో అందరికీ తెలిసిందే. తాను ఏదైనా ఎక్కడైనా సరే బాలయ్య నిర్మొహమాటంగా చెప్పేస్తారు. మరి అలా చెప్పిన వాటిలో పలు మార్లు కొన్ని మాటలు కాంట్రవర్సీలకు కూడా దారి తీశాయి. మరి తాజాగా చేసిన మరో కామెంట్సే మరో కాంట్రవర్సీకి తెర లేపినట్టు తెలుస్తుంది.

ఇక వివరాల్లోకి వెళితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. రెహమాన్ ఎవరో తనకి తెలియదు అని చేసిన కామెంట్స్ అతని అభిమానులను నొప్పించడంతో వారు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

తమకు బాలయ్య అంటే ఎవరో తెలియదు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనికి ఒక కంక్లూజన్ ఎలా వస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే బాలయ్య మరియు రెహమాన్ లు తమ తమ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :