బాలయ్య మూవీ పై లేటెస్ట్ అప్డేట్

Published on Aug 29, 2019 12:06 pm IST

నటసింహం బాలకృష్ణ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం థాయిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.గత కొన్ని వారాలుగా అక్కడ పాటలతో పాటు, బాలయ్య మరియు హీరోయిన్స్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారని సమాచారం. కాగా ఈ చిత్ర షెడ్యూలు పూర్తి కావడంతో బాలయ్య ఇండియా పయనమయ్యారని తెలుస్తుంది. దీనితో తదుపరి షెడ్యూల్ కొరకు దర్శకుడు రెడీ అవుతున్నాడట.

బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన బాలయ్య లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ భావిస్తున్నప్పటికీ స్పష్టత లేదని సమాచారం. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం :