నాగబాబు పై ఫైర్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్ !

Published on Dec 10, 2018 5:00 pm IST

ఓ ఇంటర్వ్యూలో నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. బాలయ్య ఫ్యాన్స్ నాగబాబు పై ఫైర్ అవుతున్నారు. నాగబాబు కామెంట్స్ చేసిన వీడియో కింద నాగబాబుని తిడుతూ అసభ్యకరంగా బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా తాజాగా నాగబాబు మరోమారు ఫేస్ బుక్ లో బాలకృష్ణ పెద్ద కమెడియన్ అంటూ పాత తరం నటుడి గురించి చెప్తూ.. మళ్లీ బాలయ్య అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడారు.

వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. నాకు బాలయ్య ఎవరో తెలియదనడం పెద్ద పొరబాటే.. క్షమించాలి ఒక తప్పిదం దొర్లింది. బాలకృష్ణ గారు తెలియని వాళ్ళు ఎవరుంటారండీ.. ఆయన పెద్ద కమెడియన్… ఆయనో మంచి నటుడు.. కామెడీతో ఆయన కడుపుబ్బా నవ్విస్తారు. అలాంటి హాస్యనటుడు బాలకృష్ణ గారిని తెలియదని అనడం నిజంగా నా తప్పు. ఆయన ఎన్టీఆర్ తో కూడా కలిసి పనిచేశారు. ఆయనే వల్లూరి బాలకృష్ణ గారు.. ఈయన కృష్ణ గారి అసాద్యుడిలో కూడా నటించాడు. వల్లూరి బాలకృష్ణ గురించి వికీపీడియాలో కొడితే సమగ్రంగా తెలుస్తుంది.. ప్రస్తుతం ఆయన మన మధ్యన లేరు.. చాలాకాలం క్రితం ఆయన మరణించారు..’’ అంటూ నాగబాబు కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కు బాలయ్య అభిమానులు నాగబాబును అసభ్యకరంగా తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత సమాచారం :