బాలయ్య నుంచి ఫీస్ట్ వచ్చేది అప్పుడేనా.?

Published on Jul 25, 2021 12:00 pm IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.

అయితే ఇప్పుడు క్లైమాక్స్ షూట్ నిమిత్తం తమిళనాడులో షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా కొన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సాంగ్ వచ్చే ఆగష్టు మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్, జగపతిబాబులు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :