బాలయ్య స్టెప్పులకు ఫిధా అయిన అభిమానులు !
Published on Jan 12, 2018 3:35 pm IST

నందమూరి బాలక్రిష్ణ సినిమాల్లో ఫైట్స్, డైలాగ్స్ తో పాటు ఊపు తెప్పించే పాటల్ని, వాటిలో బాలయ్య ఎనర్జిటిక్ స్టెప్పుల్ని ఆశిస్తారు ప్రేక్షకులు. అందుకే బాలక్రిష్ణ, ఆయన చిత్రాలని డైరెక్ట్ చేసే దర్శక నిర్మాతలు సినిమాలో ఖచ్చితంగా అలాంటి ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. ఈరోజే రిలీజైన ‘జై సింహా’లో నట సింహం వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిధా అయిపోయారు.

ముఖ్యంగా మొదటి పాట ‘అమ్మకుట్టి’ పాటలో అయితే అదిరిపోయే డ్యాన్స్ చేశారు బాలక్రిష్ణ. ఐదు పదుల వయసుని సైతం పక్కనబెట్టి అలుపనేదే లేకుండా ఏకధాటిగా హీరోయిన్ నటాషా దోషితో కలిసి రకరకాల మూమెంట్స్ చేశారాయన. దీంతో పాటకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంటోంది.

 
Like us on Facebook