రొమాంటిక్ లుక్ లో కేకపుట్టిస్తున్న బాలయ్య…!

Published on Nov 9, 2019 3:59 pm IST

బాలయ్య గతానికి భిన్నంగా సంక్రాంతికి ముందే బరిలో దిగుతున్నాడు. ఆయన నటించిన రూలర్ క్రిస్మన్ కానుకగా డిసెంబర్ 20న విడుదల అవుతుంది. బాలయ్య ఈ మూవీలో రెండు భిన్న గెటప్స్ లో దర్శనమిస్తున్నారు. ఒక పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్న బాలయ్య మరో పాత్రలో స్టయిలిష్ బిజినెస్ మెన్ లా కనిపిస్తారని సమాచారం. కాగా నేడు రూలర్ చిత్రం నుండి ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కలర్ ఫుల్ డ్రెస్ లో రొమాంటిక్ లుక్ లో బాలయ్య అదిరిపోయాడు. రూలర్ టీజర్ కొద్దిరోజులలో విడుదల చేస్తున్నట్లుగా హింట్ కూడా ఇచ్చారు.

ఇక సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ఈ మూవీని నిర్మిస్తుండగా, దర్శకుడు కే ఎస్ రవికుమార్ తెరకెక్కించారు. మొదటి సారి బాలయ్య చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక బాలయ్యకు జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై బాలయ్య అభిమానులలో భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More