నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘లయన్’ గత గురువారం రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చాలా విషయాల గురించి చర్చించారు. అందులో ఆయన తన 100వ సినిమా గురించిన కోన్ని ఆసక్తికర విషయాలను కూడా రివీల్ చేసాడు. బాలకృష్ణ తన 100వ సినిమా బోయపాటి శ్రీను చేసే అవకాశం ఉంది. కానీ ఇంకా దానికి సంబందించిన ఎలాంటి పనులు మొదలు కాలేదు.
100వ సినిమాపై భారీ అంచనాలుంటాయి, ఆ అంచనాలకు తగ్గట్టుగానే వేడివేడిగానే ఆ సినిమాని ప్రేక్షకులకు వడ్డిస్తామని బాలయ్య తెలిపాడు. అలాగే మాట్లాడుతూ బోయపాటి నాతో ఉన్నప్పుడు నా మాటలను, నా హావభావాలను గమనించో నా నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలను రాస్తుంటాడు. అందుకే అవి అంత బాగా వస్తాయని బాలయ్య అన్నాడు. గతంలో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ప్రస్తుతం బాలకృష్ణ శ్రీ వాస్ తో చేయనున్న 99వ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథని అందించారు.


