మేరా భారత్ మహాన్.. జై హింద్ – బాలయ్య

Published on Feb 26, 2019 4:42 pm IST

ఇటీవలే పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర‌శిబిరాల‌ను ధ్వంసం చేసింది భార‌త వైమానిక దళం. భారత వైమానిక దళాలు ఉగ్రమూకలను మట్టుబెట్టడం పై ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు భారత వైమానిక దళాలకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఘటన రియాక్ట్ అవుతూ.. సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. బాలయ్య పోస్ట్ చేస్తూ ‘‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ధైర్యం యావత్ భారత దేశానికే గర్వకారణం.. మేరా భారత్ మహాన్.. జై హింద్..’’ అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ను నందమూరి అభిమానులు షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :