“అఖండ” హైప్..అక్కడ రికార్డ్ బిజినెస్ లాక్!

Published on Oct 17, 2021 7:56 am IST

అసలు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధమైన భారీ క్రేజ్ నెలకొల్పుకున్న చిత్రం “అఖండ”.డ్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా అలాగే భారీ బడ్జెట్ పెట్టిన సినిమాగా నిలిచింది.

అయితే ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటుంది అని టాక్ కూడా ఉంది. జస్ట్ ఏరియాల వారిగానే భారీ మొత్తంలో ధర పలుకుతున్న ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు తెలుస్తోంది. అక్కడ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారట.

దీనిని బట్టి అఖండ పై ఉన్న హైప్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More