రజినీ సెన్సేషనల్ టీజర్ రికార్డ్ బ్రేకింగ్ దిశగా బాలయ్య.!

Published on Apr 23, 2021 8:00 am IST

నందమూరి నటసింహం సందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ అండ్ మాస్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ “అఖండ” నుంచి వచ్చిన లేటెస్ట్ టీజర్ సౌత్ ఇండియన్ సినిమా దగ్గర వండర్స్ ను నమోదు చేస్తున్నారు. రీసెంట్ గానే మాస్ స్పీడ్ తో 30 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు 35 మిలియన్ వ్యూస్ మైల్ స్టోన్ ను టచ్ చేసింది.

అయితే మన దక్షిణాదిలో సీనియర్ స్టార్ హీరోస్ లో అత్యధిక వ్యూస్ తో తలైవర్ రజినీ నటించిన సెన్సేషనల్ చిత్రం “కబాలి” టీజర్ రికార్డ్స్ బ్రేక్ చేసే దిశగా బాలయ్య అఖండ వెళ్తుంది. అప్పట్లో కబాలి టీజర్ ఎలాంటి హైప్ తో వచ్చిందో తెలిసిందే. అది ఇప్పటి వరకు 37 మిలియన్ కి పైగా రాబట్టింది.

కానీ ఇప్పుడు అఖండ ఆల్రెడీ మాస్ స్పీడ్ తో 35 మిలియన్ క్రాస్ చేసేసింది. సో రజినీ రికార్డు బ్రేక్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. మొత్తానికి బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే దుమ్ము లేపేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :