బన్నీ చేసిన ఐకానిక్ రోల్ లో బాలయ్యనా.?

Published on Oct 30, 2020 8:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎన్నో సినిమాల్లో కనిపించాడు. అయితే చాలా మట్టుకు స్టైలిష్ అలాగే మాస్ లుక్స్ లో కనిపించిన బన్నీ కెరీర్ లో ఒక ఐకానిక్ రోల్ ఏదన్నా ఉంది అంటే అది టాప్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన “రుద్రమదేవి” లోని గోన గన్నారెడ్డి పాత్రే అని చెప్పాలి.

ఆ పీరియాడిక్ చిత్రంలో అల్లు అర్జున్ చేసిన ఈ పాత్రకు గాను పెద్ద అప్లాస్ దక్కింది. మరి అలాంటి రోల్ లో మరెవరిని అన్నా ఊహించుకోగలమా అన్న ఊహే ఇప్పటి వరకు వచ్చి ఉండదు. కానీ నందమూరి నట సింహం బాలకృష్ణ మాత్రం ఆ పాత్రలో నటించాలని అనుకుంటున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

ఇప్పటికే బాలయ్య ఒక టీం ను ఆ రోల్ పై రీసెర్చ్ చేసేందుకు కూడా నియమించారని తెలుస్తుంది. మరి బాలయ్యకు అంతలా నచ్చిన ఈ రోల్ ను కనుక పోషిస్తే ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More