ఈ యంగ్ హీరోతో కలిసి బాలయ్య ఓ సినిమా.?

Published on Dec 6, 2020 3:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక పవర్ ఫుల్ మాస్ హ్యాట్రిక్ చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల కాబడ్డ టీజర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇక ఇదిలా ఉండే బాలయ్య మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. పలువురు సీనియర్ దర్శకులతో పాటుగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులకు కూడా బాలయ్య అవకాశం కల్పిస్తున్నారు. అలా ఇప్పుడు బాలయ్య ఓ చిత్రాన్ని ఓకే చేశారట.

దానిపై సరైన క్లారిటీ లేదు కానీ అందులో బాలయ్యతో పాటుగా లేటెస్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య కూడా నటిస్తాడని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ చిత్రానికి ఒక యువ మరియు కొత్త దర్శకుడు పని చేస్తాడని సమాచారం. మరి ఈ ఇద్దరి కలయికలో అంటే కొత్త కథే కావచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ మాత్రం దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More