మరొక షెడ్యూల్ ను ముగించేసిన బాలయ్య !
Published on Sep 25, 2017 5:31 pm IST


‘పైసా వసూల్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన బాలక్రిష్ణ తన 102వ సినిమాని కూడా వేగంగా నడిపిస్తున్నారు. ఆగష్టు ఆరంభంలో మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ హైదరాబాద్లో ముగియగా కీలక షెడ్యూల్ ను కొన్ని రోజుల క్రితమే కుంభకోణంలో ప్రారంభించారు. తాజాగా ఈ షెడ్యూల్ ముగిసినట్టు తెలుస్తోంది.

ఇక కొత్త షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ మొదలవుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండటంతో శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన కథానాయకిగా నటిస్తుండగా మలయాళ హీరోయిన్ నటాషా దోషి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ చిత్రానికి చిరంతాన్ భట్ సంగీతాన్ని అందివ్వనున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook