బాలయ్య నిర్ణయం నిజంగా సర్ ప్రైజే !

బాలయ్య నిర్ణయం నిజంగా సర్ ప్రైజే !

Published on Oct 23, 2022 11:10 PM IST

అన్‌స్టాపబుల్‌, అఖండ విజయాల తర్వాత బాలయ్యలో చాలా మార్పులు వచ్చాయి. తాజాగా బాలయ్య నిర్ణయం ఆయన అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా షాక్ కి గురి చేసింది. ఇంతకీ బాలయ్య తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటంటే.. బాలయ్య లేటెస్ట్ గా యాడ్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ఓ యాడ్ కూడా చేసేశాడు. బాలయ్య తొలిసారి ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్‌లో నటిస్తున్నాడు.

దీపావళి నుంచి టీవీల్లో యాడ్ ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మొత్తానికి బాలయ్య యాడ్ రంగంలో అగ్రగామిగానున్న మహేష్, బన్నీ లకు పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. బాలయ్య మాటకు విలువ ఉంటుంది. కచ్చితంగా బాలయ్య యాడ్స్ జనంలోకి బాగా వెళ్తాయి. మరోపక్క బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. అలాగే అన్‌స్టాపబుల్‌ 2 షోకు హోస్ట్‌గా కూడా తన మార్క్ చూపుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు