నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. గత గురువారం విడుదలైన ఈ సినిమాకి అభిమానుల నుంచ మంచి స్పందన లభిస్తోంది. చాలా సినిమాల లానే ఈ సినిమాని కూడా పైరసీ బూతం పట్టి పీడిస్తోంది. ఆంధ్ర, తెలంగాణలతో పాటు కర్ణాటకలో కూడా ఈ సినిమాకి సంబదించిన పైరసీ డివిడిలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒంగోలులో పోలీసులు కొన్ని డివిడి షాప్స్ పై రైడ్ చేసి కొన్ని వేల పైరేట్ సిడిలను పట్టుకున్నారు.
లయన్ యాంటి పైరసీ సెల్ వారు పైరసీ చేసిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. అతను ఈ బెంగుళూరు లోని ఓ థియేటర్ లో రికార్డ్ చేసినట్టు తెలిపాడు. ఎన్నో కోట్లు కర్చు పెట్టి తీసిన సినిమాలు ఇలా పారసీ దారిన పడుతుండడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ బాగా నష్టపోతున్నారు. యాన్తి పైరసీ సెల్ కూడా పైరసీని అడ్డుకోవడానికి బాగా కృషి చేస్తున్నారు. బాక్స్ ఆఫీసు వద్ద లయన్ బాగానే కాసులు వసూలు చేస్తోంది. సమ్మర్ సీజన్ కావడం వాళ్ళ వీకెండ్ లో లానే వచ్చే వారం కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది.


