బాలయ్య కోసం మరో స్క్రిప్ట్ రెడీగా ఉంది !

బాలయ్య కోసం మరో స్క్రిప్ట్ రెడీగా ఉంది !

Published on Oct 15, 2018 4:57 PM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా ఒక డ్రాఫ్ట్ పూర్తయిందని తెలుస్తోంది. ప్రముఖ రచయిత ఎమ్ రత్నం ఈ స్క్రిప్ట్ తయారుచేసే పనిలో తలమునకలై ఉన్నారు. అయితే ఈ చిత్రంలోని చాలా భాగం రాజకీయ నేపథ్యంలో సాగుతుందని గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి.

కాగా తాజాగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పుల పై ఎప్పటికప్పుడు ఎమ్ రత్నంకు బోయపాటి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారట. ప్రధానంగా రాజకీయాలతో పాటు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి ఎండగట్టే విధంగా మంచి పవర్ ఫుల్ గా ఈ స్క్రిప్ట్ ఉంటుందట.

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న బాలయ్యకు ఆయన పొలిటికల్ కెరీర్ కు సహాయపడే విధంగా ఈ సినిమాను రూపొందించాలని ఇప్పటినుంచే చిత్రబృందం ప్రణాళికలను రూపొందిస్తున్నారని ఫిల్మ్ వర్గాల టాక్. పైగా బోయపాటి బాలయ్యలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చే సినిమా పై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉంటాయి. మరి ఆ అంచనాలను ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు