మహేశ్ బాబు సినిమాలో పప్పు సుద్ద !

మహేశ్ బాబు సినిమాలో పప్పు సుద్ద !

Published on Apr 23, 2019 4:00 AM IST

అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. కాగా ఈ సినిమాలో ఓ కామెడీ క్యారెక్టర్ లో బండ్ల గణేష్ నటిస్తున్నాడు. అయితే బండ్ల గణేష్ క్యారెక్టర్ కు సంబధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది.

ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. ఏవేవో మాట్లాడే పాత్రను అనిల్ రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్ల గణేష్ నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం జూన్ ఫస్ట్ వీక్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మహేశ్ బాబు సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు