‘మహేష్’ సినిమాలో ఇంట్రస్టింగ్ రోల్ లో బండ్ల !

Published on Aug 5, 2019 12:38 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా జరుగుతోంది. అయితే నటుడు మరియు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది. ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో బండ్ల మళ్లీ నటుడిగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ రోజు, ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో బండ్ల గణేష్ పాల్గొన్నాడు. బండ్ల గణేష్ రోజుకు 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడట.

ఇక ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్లగణేష్ నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :