దయచేసి నన్ను లాగొద్దు..బండ్ల గణేష్ అభ్యర్ధన.!

Published on Nov 22, 2020 9:03 am IST

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా పరిచయం అక్కరలేని పేరు బండ్ల గణేష్. టాలీవుడ్ టాప్ నిర్మాత, అలాగే సినిమా నటునిగానే కాకుండా పొలిటికల్ గా కూడా మరింత మందికి గట్టిగా వినిపించిన పేరు. అయితే సినిమాల్లో వెనక్కి తిరిగి చూస్కోని బండ్ల పొలిటికల్ గా మాత్రం చాలా దెబ్బ తిన్నారు. దీంతో రాజకీయాలను శాశ్వతంగా వదిలేసానని పలు మార్లు కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇప్పుడు తెలంగాణాలో రాజకీయాలు హీటేక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ సందర్భంగా బండ్ల గణేష్ ను కొంతమంది మళ్లీ రాజకీయ ప్రస్తావనలలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు దీంతో వారందరికీ బండ్ల గణేష్ మరోసారి విజ్ఞప్తి చేసుకున్నారు. “నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్” అంటూ వారందరినీ రిక్వెస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More