హరీష్ శంకర్ పై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Jul 10, 2020 3:00 am IST

కొద్దిరోజులుగా నిర్మాత బండ్ల గణేష్ కి మరియు దర్శకుడు హరీష్ శంకర్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. ఒకరిని ఉద్దేశిస్తూ మరొకరు ట్వీట్స్ చేయడం జరిగింది. దానికి కారణం ఇటీవల గబ్బర్ సింగ్ మూవీ విడుదలై 8ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సంధర్భంగా చిత్ర విజయంలో భాగమైన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపిన హరీష్, ఆ చిత్ర నిర్మాత అయిన బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. ఇది హరీష్ కోపానికి కారణం అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో హరీష్ తో ఇకపై సినిమాలు చేయను అని చెప్పారు.

తాజా ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ హరీష్ గురించి పాజిటివ్ వ్యాఖ్యలు చేశారు. ఎదో ఇగో ప్రాబ్లమ్ వలన చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయన్న బండ్ల గణేష్, అంత పెద్ద దర్శకుడు డేట్స్ ఇస్తే సినిమా ఎందుకు చేయను అన్నారు. హరీష్ నాకు అన్నతో సమానం అన్నారు బండ్ల. దీనికి స్పందించిన హరీష్ శంకర్, తనపై అభిప్రాయం మార్చుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More