కామెడీ పూయించే బంగారు బుల్లోడు టీజర్

Published on Jun 30, 2020 3:45 pm IST

అల్లరి నరేష్, పూజా ఝవేరి జంటగా దర్శకుడు గిరి పాలిక తెరకెక్కిస్తున్న చిత్రం బంగారు బుల్లోడు. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ చిత్ర టీజర్ అల్లరి నరేశ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. భారీ కామెడీ క్యాస్టింగ్ తో కూడిన బంగారు బుల్లోడు టీజర్ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ గోల్డ్ లోన్ సెక్షన్ లో పనిచేసే బ్యాంకు ఎంప్లొయ్ అని అర్థం అవుతుంది. ఈ కామెడీ ఎంటరైనర్ లో బంగారం చోరీ వ్యవహారం కథలోని కీలక విషయం అని సమాచారం

హీరోయిన్ పూజా ఝవేరి గ్లామర్ ఆకట్టుకోగా, 30ఇయర్స్ పృథ్వి,సత్యం రాజేష్,వెన్నెల కిషోర్, ప్రవీణ్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను, మహేష్ వంటి కామెడీ గ్యాంగ్ తో బంగారు బుల్లోడుగా అల్లరి నరేష్ అలరించడం ఖాయం అని అర్థం అవుతుంది. వీర బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More