టాలీవుడ్లో ఏ హీరోకి అందని రికార్డు బన్నీ కొట్టాడు.

Published on Jul 10, 2020 2:25 pm IST

ఒక సినిమా విజయంలో సాంగ్స్ పాత్ర చాలా ఉంటుంది. సినిమాకంటే ముందే విడుదలయ్యే సాంగ్స్ హిట్ కొడితే సినిమా సగం హిట్ అయినట్లే అని నిర్మాతలు భావిస్తారు. దానికి అల వైకుంఠపురంలో విజయం గొప్ప నిదర్శనం. 2020 సంక్రాంతికి విడుదలై భారీ విజయం అందుకున్న అల వైకుంఠపురంలో సాంగ్స్ టాలీవుడ్ తో పాటు దేశంలోని అన్ని పరిశ్రమలను ఊపేశాయి. థమన్ స్వర కల్పనలో రూపొందిన అల వైకుంఠపురంలో సాంగ్స్ నిజంగా ప్రభంజనం సృష్టించాయి. బాలీవుడ్ స్టార్స్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సైతం అల వైకుంఠపురంలో సాంగ్స్ కి స్టెప్స్ వేశారు.

సినిమాలోని అన్ని సాంగ్స్ ఆదరణ దక్కించుకోగా బుట్ట బొమ్మ సాంగ్ మరింత పాపులర్ అయ్యింది. ఇక ఈ బుట్ట బొమ్మ వీడియో సాంగ్ యు ట్యూబ్ లో అనేక రికార్డ్స్ నమోదు చేసింది. బన్నీ మెస్మరైజింగ్ స్టెప్స్, పూజ హెగ్డే గ్లామర్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా 260 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్ టాలీవుడ్ లోనే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న వీడియో సాంగ్ గా రికార్డులకు ఎక్కింది.వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా మూవీలోని ‘వచ్చిండే’ సాంగ్ రికార్డు బ్రేక్ చేసి బన్నీ ఈ రికార్డు అందుకున్నాడు. అంటే టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో అందుకోని రికార్డ్ బన్నీ బుట్ట బొమ్మా సాంగ్ తో అందుకున్నాడన్న మాట. ఏమైనా బన్నీ గ్రేట్ అనాల్సిందే .

సంబంధిత సమాచారం :

More