పవన్ మూవీ విజయంపై ఆధారపడిన బన్నీ మూవీ…!

Published on Jul 11, 2020 7:44 am IST

బన్నీ వరుసగా చిత్రాలు ప్రకటించారు. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తుండగా, తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీలో నటించనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఎప్పుడో మొదలుకావాల్సి వుంది. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటించాల్సి ఉండగా, సేఫ్ సైడ్ గా త్రివిక్రమ్ తో అల వైకుంఠపురంలో మూవీ చేశారు.

కాగా దర్శకుడిగా వేణు శ్రీరామ్ కి పెద్దగా హిట్ ట్రాక్ లేదు. అందుకే బన్నీ ఆ ప్రాజెక్ట్ ని అప్పుడు పక్కన పెట్టారు. కాగా వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవన్ తో వకీల్ సాబ్ చేస్తున్నారు. ఈ మూవీ ఫలితాన్ని బట్టి అల్లు అర్జున్ ఐకాన్ మూవీ చేసేది లేనిది నిర్ణయిస్తాడట. కాబట్టి ఐకాన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే వకీల్ సాబ్ హిట్ కొట్టాలన్న మాట వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More