అలవైకుంఠపురంలో బన్నీ లేటెస్ట్ లుక్ అదిరిందిగా

Published on Nov 21, 2019 9:18 pm IST

బన్నీ గత చిత్రాలకు భిన్నంగా అలవైకుంఠపురంలో చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విడుదల చేస్తూ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన క్లాస్ మెలోడీ సాంగ్ ‘సామజవరగమనా…’ మరియు ఫోక్ బీట్ మాస్ సాంగ్ ‘రాములో రాములా…’ సూపర్ హిట్ సాధించాయి. ఈ స్పూర్తితో అల వైకుంఠపురంలో నుండి మూడవ సాంగ్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈసాంగ్ ప్రోమో విడుదల చేసిన చిత్ర యూనిట్ రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు.

కాగా ‘ఓ మై గాడ్ డాడీ..’ అనే ఈ సాంగ్ విడుదల అనౌన్స్మెంట్ పోస్టర్ లో బన్నీ లుక్ కేకగా ఉంది. లైట్ గ్రీన్ కలర్ హూడెడ్ టి షర్ట్ మరియు నిట్ క్యాప్ ధరించి గాగుల్స్ పెట్టుకొని ఉన్న ఆయన అల్ట్రా మోడ్రన్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో బన్నీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం సూపర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా,టబు, సుశాంత్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More