ఇంట్రెస్టింగ్ గా “బతుకు బస్టాండ్” ట్రైలర్!

Published on Jul 23, 2021 7:08 pm IST


తెలుగు సినీ పరిశ్రమలో కి కొత్త నటీనటులు వస్తున్నారు. అయితే విరాన్ ముత్తంశెట్టి హీరోగా వెండితెర కి పరిచయం అవుతున్న చిత్రం బతుకు బస్టాండ్. ఈ చిత్రం లో నికిత అరోరా, శృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పథకం పై చక్రధర్ రెడ్డి సమర్పణ లో కవితా రెడ్డి, కే. మాధవి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఐ. ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై సాధారణ ప్రేక్షకుల తో పాటుగా, సినిమా ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

అయ్యే ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటల నుండి ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విధాల అయింది. అయితే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం తో సినిమా పై చర్చలు జరుగుతున్నాయి. విడుదల అయిన కొద్ది సేపటికే ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి మహావీర్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :