సమంత, నయనతార.. ఫైట్ బాగుంటుందట

Published on Feb 17, 2020 1:32 pm IST

స్టార్ హీరోయిన్లు సమంత, నయనతారలు కలిసి విజయ్ సేతుపతి సరసన ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చాలా సన్నివేశాలే ఉంటాయట. కథలో హీరో కోసం ఇద్దరికీ పెద్ద ఫైట్ జరుగుతుందట. అయితే ఇదంతా హాస్యభరితంగానే ఉండనుంది.

ఇద్దరి మధ్యన నలిగిపోయే హీరో విజయ్ పాత్రలో బోలెడంత ఫన్ ఉండనుంది. మార్చ్ నుండి సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయనున్నాడు. సేతుపతికి ఉన్న స్టార్ డమ్ కి నయనతార, సమంతల క్రేజ్ తోడవటంతో ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సేతుపతికి తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆదరణ ఉండటం, నయనతార, సమంతలకు ఎలాగూ తెలుగులో మంచి ఆదరణ ఉండటంతో చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో విడుదలకావచ్చు.

సంబంధిత సమాచారం :

X
More