6వ వారంలో కూడా టాప్ ప్లేస్ లో నిలిచిన ‘బాహుబలి’ !


ఏప్రిల్ 28న విడుదలైన ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికీ దాదాపు అన్ని ఏరియాల్లో దిగ్విజయంగా నడుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, తమిళంలలో కూడా ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. తమిళనాడులో విడుదలైన రోజు కాస్త మిశ్రమ స్పందన లభించినా తర్వాత తర్వాత పుంజుకుని తమిళ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింది.

ఇప్పటికే టాప్ గ్రాసర్ గా రజనీ ‘రోబో’ ను బీట్ చేసిన ఈ చిత్రం వరుసగా 6 వ సారి కూడా స్ట్రాంగ్ కలెక్షన్లను రాబడుతూ చెన్నై బాక్సాఫీస్ టాపర్ గా నిలిచింది. ఒక తెలుగు చిత్రం ఇలా వరుసగా ఆరు సార్లు అన్ని తమిళ సినిమాలన్నింటినీ బీట్ చేయడమంటే విశేషమనే చెప్పాలి. ఇకపోతే చెన్నై నగరవ్యాప్తంగా ఈ చిత్రం యొక్క 38 రోజుల వసూళ్లను చూస్తే దాదాపు రూ.18 కోట్లుకు దగ్గరగా ఉంది.