మార్నింగ్ షో టికెట్లు ఫ్రీ.. ఈ సాహసం సక్సెస్ కావాలి

Published on Nov 21, 2019 7:08 pm IST

ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ రోజుల్లో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఎంత కష్టమో మనకు తెలుసు. చిన్న సినిమాలకైతే ఈ తంతు మరీ కష్టం. అందుకే ఆ సినిమా నిర్మాతలు జనాన్ని ఆకట్టుకోవడం కోసం కొత్త తరహా ప్రమోషన్స్ ట్రై చేస్తుంటారు. రేపు విడుదలకానున్న చిన్న చిత్రం ‘బీచ్ రోడ్ చేతన్’ ఇలాంటి ప్రయత్నమే ఒకటి చేస్తోంది.

తమది చిన్న సినిమా కాబట్టి మినిమమ్ ఆక్యుపెన్సీ ఉండి, పాజిటివ్ టాక్ వస్తేనే ఫ్యూచర్ రన్ ఉంటుంది. ఆ మినిమమ్ ఆక్యుపెన్సీ రావాలంటే మొదటి రోజు మొదటి షో టికెట్లు ఉచితంగా ఇవ్వాలని చిత్ర బృందం సంకల్పించింది. అది కూడా కొన్ని చోట్ల కాదు ఏపీ, తెలంగాణ అంతట. ఫ్రీగా సినిమా చూపిస్తాం అంటే జనం ఆసక్తి చూపుతారు కాబట్టి థియేటర్లు నిండుతాయని, ఆ జనం నుండి పాజిటివ్ టాక్ వస్తే సెకండ్ డే నుండి పుంజుకోవచ్చనేది టీమ్ వేసిన ప్లాన్. సినిమా కోసం టీమ్ చేస్తున్న ఈ సాహసం సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.

‘గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు’ ఫేమ్ చేతన్ మద్దినేని ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాదు స్వయంగా నిర్మించి, దర్శకత్వం కూడా వహించడం విశేషం.

సంబంధిత సమాచారం :