ఇంట‌ర్వ్యూ : బెల్లంకొండ శ్రీనివాస్ – `రాక్ష‌సుడు` నుంచి నేను చాల నేర్చుకున్నాను.

Published on Jan 2, 2020 5:15 pm IST

ఈ ఏడాది `రాక్ష‌సుడు`తో మంచి హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌ లో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా రేపు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..
 

రేపు మీ బర్త్ డే. ప్రతి పుట్టిన రోజుకి ఎలా ఆలోచిస్తారు ?

 

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాననే ఫీలింగ్ తో ఉంటాను. ఇక కొత్తగా ఆలోచన అంటే ఒక్కటే ఉంటుంది, మంచి సినిమాలు చేయాలనుకుంటాను.

 

వయసు పెరిగిపోతుందనే ఫీలింగ్ ఏమి లేదా ?

 

నాకు వయసు చాల తక్కువేనండి. ప్రెజెంట్ 26. మరో నాలుగేళ్లు గడిచాక ముప్పైలోకి అడుగు పెట్టాక అప్పుడు అనిపిస్తోందేమో వయసు పెరిగిందని. ఇప్పుడైతే అలాంటి భయాలు ఏమి లేవు.

 

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా గురించి చెప్పండి ?

 

మంచి లవ్ స్టోరీ అలాగే పూర్తి కామెడీ మూవీ చేస్తున్నాం. లాస్ట్ ఇరవై నిముషాలు తప్ప.. మిగతా భాగం మొత్తం ఫుల్ కామెడీనే ఉంటుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారి ట్రాక్, నా ట్రాక్ సినిమాలో చాల బాగుంటాయి.

 

కామెడీ చేయటం కష్టం అంటారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తోందా ?

 

అన్ని ఎమోషన్స్ కంటే కామెడీ చేయడం కష్టమే. కానీ ఫస్ట్ టైం ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నాను. నా కెరీర్ లో మొదటిసారి ఫుల్ కామెడీ మూవీ చేస్తున్నాను. నా క్యారెక్టర్ చాల బాగుంటుంది. నాకు బాగా కనెక్ట్ అయింది.

 

రీసెంట్ గా మీరు గెడ్డం పెంచారు. సంతోష్ శ్రీనివాస్ తో చేస్తోన్న సినిమా కోసమేనా ?

లేదండి. అందరూ పెంచుతున్నారని నేనూ పెంచాను. కానీ మా డైరెక్టర్ గారు నాకు గెడ్డం వద్దు, పూర్తి యంగ్ లుక్ లో కావాలన్నారు. ఈ సినిమాలో యంగ్ లుక్ లో కనిపిస్తాను.

 

ఈ ఏడాది `రాక్ష‌సుడు`తో మంచి హిట్ అందుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ?

 

`రాక్ష‌సుడు` సినిమా నుంచి నేను చాల నేర్చుకున్నాను. కంటెంటే కింగ్ అని ఆ సినిమా నిరూపించింది. ఇక నుంచి నేను చేయబోయే సినిమాల పై ఖచ్చితంగా `రాక్ష‌సుడు` ప్రభావం ఉంటుంది. అంతలా ఆ సినిమా నా కెరీర్ ను ప్రభావితం చేసింది.

 

మరి ఈ బర్త్ డేకి ఏమి ప్లాన్ చేశారు ?

 

ప్రత్యేకంగా ప్లాన్ ఏమి చేయలేదండి. రేపు కూడా షూటింగ్ ఉంది. పైగా కంటిన్యూగా షూట్ చేస్తున్నాం. సో ఈ బర్త్ డే షూటింగ్ లోనే గడిచిపోనుంది.

సంబంధిత సమాచారం :

X
More