పవర్ఫుల్ మాస్, యాక్షన్ సీన్స్ తో అదరగొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ టీజర్

Published on Mar 30, 2023 4:03 pm IST

అల్లుడు శ్రీను మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ మూవీ తో మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఆ తరువాత జయ జానకి నాయక, సీత, రాక్షసుడు వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. ఇక ప్రస్తుతం తొలిసారిగా ఆయన బాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ఛత్రపతి. కొన్నేళ్ల క్రితం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి సినిమా తెలుగులో రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.

కాగా ఆ మూవీని ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీలో తెరకెక్కించారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీని పెన్ మూవీస్ బ్యానర్ పై ధవల్ జయంతిలాల్ గడ, అక్షయ్ జయంతిలాల్ గడ గ్రాండ్ గా నిర్మించారు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు మేకర్స్. కాగా భారీ యాక్షన్, మాస్ హంగులతో ఛత్రపతి టీజర్ అదిరిపోయింది. ముఖ్యంగా టీజర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్, స్టైల్, యాక్షన్, ఫైట్స్ అదిరిపోయాయి, అలానే బీజీఎమ్ తో పాటు విజువల్స్ కూడా ఎంతో బాగున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ మూవీని సమ్మర్ కానుకగా మే 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :