ఇంటర్వ్యూ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్-షూట్ తరువాత కూడా జ్ఞాపకాలు వెంటాడేవి..

ఇంటర్వ్యూ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్-షూట్ తరువాత కూడా జ్ఞాపకాలు వెంటాడేవి..

Published on Aug 1, 2019 3:39 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. టీనేజ్ గర్ల్స్ ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని, రాక్షసుడు చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం…

 

మీరు ‘రాక్షసుడు’ మూవీ ఒరిజినల్ వర్షన్ చూశారా?

చూశాను, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావడంతో నాకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్రంలో చాలా ఇన్వాల్వ్ అవి చేయడం జరిగింది. ఎప్పుడూ శవాలు, మార్చురీ లలో షూటింగ్ కారణంగా, షూట్ తరువాత కూడా ఆ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉండేవి. మనకు తెలిసిన,మనతో అనుబంధం ఉన్న ఆడపిల్లలకు నిజంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే పరిస్థితి ఏమిటి అనే బాధ కలిగేది.

 

ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఏమిటో చెవుతారా?

మనకు తెలిసిన,మనతో ఉన్న ఆడపిల్లకు ఏమైనా జరిగితే తట్టుకోలేము. ఆ పాయింట్ నే ఈ చిత్రంలో డిస్కస్ చేయడం జరిగింది. చిత్రంలో నా మరదలు పాత్ర చేసే అమ్మాయి ఇలాగే చనిపోతుంది. మూవీ రెండవ భాగం మొత్తం నాపాత్ర చాలా సీరియస్ గా,బావోద్వేగంగా సాగుతుంది. తమిళ చిత్రం కంటే కూడా మా చిత్రంలో ఇంకా బాగా సన్నివేశాలు తెరకెక్కించడం జరిగింది.

 

వర్జినల్ వర్షన్ చూసిన తరువాత అలా చేయలేమనే భావన ఏమైనా కలిగిందా?

అలాంటి భయం నాకు కలుగలేదు. ఎందుకంటే నేను ఈ మూవీని చాలా ఇష్టపడి చేయడం జరిగింది. ఒరిజినల్ మూవీ ఫీల్ మిస్ కాకుండా నా శైలిలో నేను నటించడం జరిగింది.

 

రమేష్ వర్మ లాంటి కొత్త దర్శకుడితో మూవీ ఎలా అనిపించింది?

కొత్త దర్శకుడు అనికాదు, ఈ చిత్రంలో కథే హీరో. అది నమ్మి చేయడం జరిగింది.

 

వర్జినల్ వెర్షన్ కి మార్పులు ఏమైనా చేశారా?

మార్పులు అంటే సినిమా చుస్తే మీకు తెలుస్తుంది. కాకపోతో కథలోని కీ పాయింట్ మిస్ కాకుండా దాదాపు ఎటువంటి మార్పులు చేయకుండా తెలుగు వర్షన్ తెరక్కెక్కించాము. కొన్ని కథలను మార్పులు చేయడం కుదరదు. రీమేక్ అనే ఫీలింగ్ రాకూడని చాలా కస్టపడి పని చేశాను. 85రోజులు నిరవధికంగా పనిచేయడం జరిగింది.

 

ఈ చిత్రం తరువాత కమర్షియల్ మూవీస్ చేస్తారా లేక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు చేస్తారా?

నెక్స్ట్ కమర్షియల్ మూవీనే చేయాలని ఆలోచన ఉంది. ఆ కమర్షియల్ చిత్రాలలో ఉండే డాన్స్ లు ఫైట్లు మిస్ అవుతున్నాను (నవ్వుతూ)

 

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెవుతారా?

ఇంకా ఏ మూవీకి సైన్ చేయలేదు.రెండు మూడు చిత్రాలు ఉన్నాయి కానీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే వెల్లడిస్తాను.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు