క్రేజీ రీమేక్స్ లైన్లో పెట్టిన బెల్లంకొండ

Published on May 1, 2021 12:00 am IST

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయోగాలకు రెడీ అయ్యారు. ఇన్నాళ్లు యాక్షన్ ఎంటర్టైనర్లు, కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చిన ఆయన ఈసారి రీమేక్ సినిమాల మీద మనసుపెట్టారు. ఇప్పటికే తెలుగు సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఈమధ్యనే ఈ రీమేక్ పనులు మొదలవ్వగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి నిలిచిపోయాయి. ఇక తాజాగా తమిళంలో ధనుష్ చేసిన ‘కర్ణన్’ సినిమాను రీమేక్ చేయాలని బెల్లంకొండ డిసైడ్ అయ్యారట.

ఒరిజినల్ వెర్షన్ చూసిన వెంటనే బాగా ఇంప్రెస్ అయి హక్కులు కొనేశారట. ఈ తెలుగులో ఆయన నెక్స్ట్ సినిమా ఇదే అంటున్నారు. అయితే దర్శకుడు ఎవరు, ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు ఇంకా బయటకురాలేవు. ఈ ఒక్కటే కాదు ఇంకో రెండు సినిమాలను బెల్లంకొండ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. అవి కూడ పెద్ద హీరోల సినిమాలే అని తెలుస్తోంది. మరి కెరీర్లో వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న ఈ యువ హీరోకు ఈ రీమేక్ కథలైనా సక్సెస్ ఇస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :