ఈ ఏడాది ‘కిక్ 2’తో ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిన మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా తమ మాస్ ఫ్లేవర్ తో చేసిన సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘రచ్చ’ లాంటి హిట్ తర్వాత దర్శకుడు సంపత్ నంది నుంచి ఈ బెంగాల్ టైగర్ లో రవితేజ స్టైల్ కనపడుతూనే పూర్తి ఎంటర్టైనింగ్ గా ఉండేలా ప్లాన్ చేసారు. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న వరల్డ్ వైడ్ న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది.
అందుకే ఈ చిత్ర టీం ఆడియో సక్సెస్ ని పురష్కరించుకొని ప్లాటినం డిస్క్ వేడుకని చాలా గ్రాండ్ గా చేయడానికి సిద్దమయ్యారు. అందులో భాగంగానే నవంబర్ 30న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాటినం డిస్క్ చేయడానికి సిద్దమయ్యారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బొమన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది.


