శోభన్ బాబుగా కనిపించనున్న ఆ సైకో విలన్.

Published on Feb 17, 2020 9:47 am IST

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ దివంగత జయలలిత బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో షూటింగ్ కొనసాగుతుండగా జూన్ నెలలో విడుదల కానుంది. హిందీ, తెలుగు మరియు తమిళంతో పాటు పలు భాషలలో ఈ చిత్రం విడుదల అవుతుండగా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రం కోసం కంగనా డాన్స్, హార్స్ రైడింగ్ వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

కాగా తలైవి సినిమాలో ఎమ్ జి ఆర్ గా అరవింద స్వామి చేస్తుండగా అయన లుక్ కి విశేష స్పందన దక్కింది. ఐతే జయలలిత జీవితంలో గల ప్రముఖ వ్యక్తులలో శోభన్ బాబు ఒకరు. ఈ పాత్ర కోసం బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా ను తీసుకున్నారట. శోభన్ బాబుగా జిష్షు సేన్ గుప్తా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇటీవల నాగ శౌర్య హీరోగా వచ్చిన అశ్వథామ చిత్రంలో జిష్షు ప్రధాన విలన్ గా చేశారు. ఆ సినిమాలో సైకో విలన్ గా ఆయన మంచి నటన కనబరిచాడు. ఇక తలైవి సినిమాకు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More