‘భాగమతి’ ఓవర్సీస్ తాజా వసూళ్ల వివరాలు !

అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం యూస్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి నుండి పాజిటివ్ క్రేజ్ ఉన్న ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలు కలిగి ఉండటంతో తొలిరోజే మంచి టాక్ బయటికొచ్చింది. దీంతో ఓపెనింగ్స్ తో పాటు మొదటి మూడు రోజులు మంచి రన్ కూడా దక్కింది. ప్రీమియర్లతో కలిపి శుక్రవారం 2.77 లక్షల డాలర్లను రాబట్టిన ఈ చిత్రం శనివారం 2.4 లక్షల డాలర్లను, ఆదివారం 1.7 లక్షల డాలర్లు, సోమవారం 40 వేలు, మంగళవారం 60 వేల డాలర్లను రాబట్టి మొత్తంగా 8.24 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది.

దీంతో సినిమా ఈ వారం ముగిసే నాటికి మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా మంచి రన్ ను కనబడరుస్తూ ఈ వారం బాక్సాఫీస్ లో టాప్ స్థానంలో నడుస్తోంది. ఈ వసూళ్ల వర్షంతో ఇంకొద్ది రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్ని చవిచూడనున్నారు. జి. అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ మంచి బడ్జెట్ తో తెరకెక్కించింది.