టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రంకి ఫేమస్ యాప్ అయిన బుక్ మై షో లో 1.23 మిలియన్స్ కి పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఆన్లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా భగవంత్ కేసరి జోరు కొనసాగుతూనే ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.


