అనుష్కతో ‘భాగమతి’.. అంజలితో ‘చిత్రాంగద’

అనుష్కతో ‘భాగమతి’.. అంజలితో ‘చిత్రాంగద’

Published on Feb 4, 2015 12:55 PM IST

anushka-anjali

అనుష్క హీరోయిన్ గా ‘భాగమతి’ అనే చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించడానికి ‘పిల్ల జమిందార్’ ఫేం అశోక్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ‘భాగమతి’ పాత్ర కోసం అనుష్క స్థానంలో అంజలిని తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను దర్శకుడు ఖండించారు. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని ‘భాగమతి’ సినిమాలో అనుష్కే హీరోయిన్ అని తెలిపారు.

అంజలి ప్రధాన పాత్రలో ‘చిత్రాంగద’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా రూపొందించడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెష్ స్క్రిప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ‘భాగమతి’తో దీనికి సంబంధం లేదు. అని ప్రొడక్షన్ యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

రెండూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కావడం, దర్శకుడు కూడా ఒక్కరే కావడంతో.. ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు కన్ఫ్యూజన్ కి గురయ్యాయి. ఒకరి సినిమాలో మరొకరికి స్థానం లేదు. అనుష్క, అంజలి ఇద్దరితో అశోక్ దర్శకత్వంలో సినిమాలు ఉంటాయి. అని దర్శకుడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

తాజా వార్తలు