డైలమాలో ‘కాంత’ బ్యూటీ.. ఇక ఆ సినిమాపైనే ఆశలు..!

డైలమాలో ‘కాంత’ బ్యూటీ.. ఇక ఆ సినిమాపైనే ఆశలు..!

Published on Jan 30, 2026 10:00 PM IST

Lenin

‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన భాగ్యశ్రీ బొర్సే అతి తక్కువ సమయంలోనే తన గ్లామర్ మరియు నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం అందానికే పరిమితం కాకుండా ‘ఆంధ్ర కింగ్ తాలుకా’, ‘కాంత’, ‘కింగ్డమ్’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. బాలీవుడ్‌లో ‘యారియాన్ 2’తో అరంగేట్రం చేసి ‘చందు ఛాంపియన్’ వంటి భారీ చిత్రాల్లో భాగమైన ఈమె, ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

ముఖ్యంగా ‘కాంత’ సినిమా ఫలితం ఎలా ఉన్నా, అందులో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు భాగ్యశ్రీకి కొండంత బలాన్నిచ్చాయి. తన పర్ఫార్మెన్స్‌కు లభించిన పాజిటివ్ రెస్పాన్స్ గురించి స్పందిస్తూ.. “ఒక కొత్త నటిగా ఇంత త్వరగా నా ప్రతిభను నిరూపించుకోవడానికి ఇంతటి గొప్ప వేదిక దక్కడం నా అదృష్టం. ఈ గుర్తింపు నా కలల వైపు మరింత కష్టపడి పనిచేసేలా నన్ను ప్రేరేపిస్తోంది. నిజం చెప్పాలంటే నా ప్రయాణం ఇప్పుడే మొదలైందనిపిస్తోంది” అని ఆమె తన సంతోషాన్ని పంచుకుంది.

ఇక అక్కినేని అఖిల్ సరసన పూర్తి రూరల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమాపై ఆమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్‌కు బూస్ట్ ఇవ్వాలని ఆమె కోరుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు