భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ క్లైమాక్స్ !

29th, January 2018 - 09:31:44 AM

స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’ యొక్క ఫస్ట్ ఓత్ రిపబ్లిక్ డేకు విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది. సామాజిక అంశాలకు కమర్షియల్ విలువల్ని జోడించి అద్భుతంగా సినిమాను తీయగల దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రంలో మహేష్ ను ముఖ్యమంత్రిగా చూపించబోతుండటంతో ప్రేక్షకుల్లో చిత్రంపై నిరాశక్తి, అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం హైదరాబాదులో చిత్ర క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. పబ్లిక్ మీటింగ్ బ్యాక్ డ్రాప్లో ఉండబోయే ఈ ఫైట్ ను ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లు రూపొందిస్తున్నారు. ఈ భారీ ఫైట్స్ సినిమాకు చాలా కీలకంగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తోంది.