మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ పెట్టుకుని రూపొందించారు. ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా కట్ చేశారు మేకర్స్. ఈ సంక్రాంతి పండుగను ముందుగానే తీసుకొస్తున్నట్లుగా ఈ ట్రైలర్‌ను ఫన్నీగా కట్ చేశారు. ఇక తనదైన కామెడీ టైమింగ్‌తో వింటేజ్ రవితేజ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తాడు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్ వంటి ఆర్టిస్టులు తమ కామెడీతో ప్రేక్షకులను ఈ పండుగకు నవ్వులలో ముంచేందుకు సిద్ధమవుతున్నారు.
రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


