అల్లూరి అన్న..భీమ్ తమ్ముడు లాజిక్ అదేనా..?

Published on Mar 28, 2020 1:12 pm IST

చరణ్ బర్త్ డే కానుకగా నిన్న విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో అద్భుతంగా అనిపించినప్పటికీ అనేక ఫజిల్స్ మరియు సందేహాలు మిగిల్చింది. అల్లూరిగా చరణ్ లుక్ అసలు చరిత్రతో పోలిక లేకుండా సాగింది. ఆయుధాలపై, యుద్ధవిద్యలపై అపారమైన పట్టు ఉన్న వీరుడిగా చరణ్ పాత్రను పరిచయం చేశారు. ఇక ఆయన పోలీస్ గెటప్ లో మరో షాక్ ఇచ్చారు. అది దాడిలో భాగమా లేక, అసలుకు కూడా పోలీసా అనేది తెలియదు.

కాగా అల్లూరి పాత్రను పరిచయం చేసిన కొమరం భీమ్ వీడియోలో అల్లూరిని అన్నగా సంబోధించాడు. అల్లూరి.. భీమ్ కి అన్న ఎలా అయ్యాడు అనేది అస్పష్టం. ఇక కేవలం వారు పుట్టిన తేదీల ఆధారంగా అల్లూరిని అన్నగా, భీమ్ ని తమ్ముడిగా రాజమౌళి చేశారేమో. చరిత్ర చూస్తే అల్లూరి 1897-98 లలో పుట్టినట్లు ఆధారాలుండగా, కొమరం భీమ్ 1901లో పుట్టారు. ఇక ఈ మూవీ ఫిక్షనల్ స్టోరీ అని జక్కన్న ముందుగానే చెప్పడంతో, దీనిపై లాజిక్స్ వెతుక్కోవడం కష్టమే.

సంబంధిత సమాచారం :

X
More