యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న భీమ్ ఫర్ రామరాజు

Published on Mar 29, 2020 4:30 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుండి భీమ్ ఫర్ రామరాజు పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ లో రామరాజుగా చరణ్ లుక్ మరియు పాత్ర తీరును పరిచయం చేస్తూ విడుదలైన ఆ వీడియో యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్న ఆ వీడియో ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. అలాగే ఈ వీడియో లైక్స్ 3 లక్షలకు చేరువయ్యాయి. ఈ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ హైలైట్ గా నిలిచింది.

రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఐదు భాషలలో భారీగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని జులై 30, 2020లో విడుదల చేయాలని భావించారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More