మళ్లీ “భీమ్లా నాయక్” వాయిదా.. ఆ తేదికి మార్చేశారా?

Published on Dec 21, 2021 1:24 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నా ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందన్న వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఫిబ్రవరి 25కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మేకర్స్ రేపు అధికారికంగా ప్రకటించనున్నారట. అయితే కొద్ది రోజుల నుంచి ఈ సినిమా సంక్రాంతి రేసులోనే ఉంటుందని క్లారిటీ ఇస్తున్న మేకర్స్ రేపు ఏ రీజన్ చెప్పి వాయిదా వేస్తారో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :