బిగ్గెస్ట్ బ్యాటిల్ ని తానే స్టార్ట్ చేయనున్న భీమ్లా నాయక్.!

Published on Aug 3, 2021 7:02 am IST


ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాలలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం కూడా ఒకటి. మళయాళ చిత్రం అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ రోల్ పేరు రివీల్ చేసిన నాటి నుంచి సాలిడ్ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది అని ముందే కన్ఫర్మ్ చేసుకుంది.

మరి దీని తర్వాత ‘రాధే శ్యామ్”, “సర్కారు వారి పాట” లాంటి మరో భారీ చిత్రాలు కూడా రేస్ లో డేట్స్ కన్ఫర్మ్ చెయ్యడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఎట్టకేలకు అనుకున్న విధంగానే ఈ చిత్రంతో భీమ్లా నాయక్ నే మొట్ట మొదట గా అడుగు పెట్టడం కన్ఫర్ అయ్యింది. వచ్చే జనవరి 12 నే ఈ చిత్రం విడుదల కానున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చెయ్యడమే కాకుండా త్వరలోనే థమన్ సమకూర్చిన ఫస్ట్ సింగిల్ కూడా తొందరగానే రిలీజ్ చేస్తున్నట్లు క్రేజీ అప్డేట్ ఇచ్చారు..

దీనితో వచ్చే ఏడాది సంక్రాంతి బ్యాటిల్ ఇంకో లెవెల్లో ఉండనుంది అని అర్ధం అయ్యిపోయింది. ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు..

సంబంధిత సమాచారం :